బైక్ ప్రమాదంలో మృతి చెందిన అనంత పద్మనాభన్‌కు శ్రావణ్ కుమార్ నివాళి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ముంచింగిపుట్టు
ముంచంగిపుట్టు మండలం ఇంద్రకొలని గ్రామ ధారపలి జంక్షన్లో బైక్ ప్రమాదంలో మృతి చెందిన కించాయిపుట్ పంచాయతీ పేసా ఉపాధ్యక్షులు రొబ్బా అనంత పద్మనాభన్ భౌతికకాయానికి రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ నివాళులర్పించారు. స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.