ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ర్యాలీ: జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

ఓట్ల చోరీ వ్యవహారానికి వ్యతిరేకంగా పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ప్రతిపక్ష ఎంపీలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారని Telangana Congress వెల్లడించింది. ఈ నిరసనలో పాల్గొన్న నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.