కళ్యాణ్‌లో రెండేళ్ల బాలుడిపై తండ్రి దారుణ దాడి
రిపోర్టర్: సురేష్
స్థలం: மகாராஷ்டிரா
మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ పర్నాక ప్రాంతంలో రెండేళ్ల కుమారుడు తనను చూసి దూరంగా వెళ్లాడన్న కోపంతో రాహుల్ సురేశ్ విసాలే అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. బాలుడిని కిందకు విసిరివేసి, వేడి పెనంపై చేతి వేళ్లు పెట్టి కాల్చాడు. అడ్డువచ్చిన భార్య రోహిణిపై కూడా దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బజార్‌పేత్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్, జువెనైల్ జస్టిస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.