'రాతపరీక్ష తప్పనిసరి': వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రిపోర్టర్: మహేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం అకడమిక్ మార్కుల ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలన్న గత ఉత్తర్వులను రద్దు చేస్తూ, పారదర్శకత కోసం ఏపీపీఎస్సీ ద్వారా రాతపరీక్షను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇప్పటికే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో, తాజా నిబంధనలతో అర్హులైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.