అంతరిక్షంలో తొలిసారిగా ఆయుధాలు మోహరించిన అమెరికా
రిపోర్టర్: శివ
స్థలం: World
అమెరికా తొలిసారిగా అంతరిక్ష కక్ష్యలో ఆయుధాలను మోహరించినట్లు అధికారికంగా ప్రకటించింది. శత్రు దేశాల దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ అంతరిక్ష ఆయుధాలు ఉపయోగపడతాయని వైమానిక దళ సెక్రటరీ ట్రాయ్ మీంక్ వెల్లడించారు. అయితే ఆయుధాలకు సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.