జగిత్యాల బాలుడి దత్తత వివాదం: హైకోర్టులో కలెక్టర్ సత్యప్రసాద్ పిటిషన్
రిపోర్టర్: సురేష్
స్థలం: జగిత్యాల
జగిత్యాలలో సంచలనం సృష్టించిన బాలుడి దత్తత వ్యవహారంలో హైకోర్టును కలెక్టర్ సత్యప్రసాద్ ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. చిన్నారిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగిస్తూ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలని పిటిషన్ లో కోరారు. నిబంధనలను పూర్తిగా పరిశీలించకుండానే బాలుడిని అప్పగించారని పేర్కొన్నారు. ఈ పరిణామంతో చిన్నారిని దంపతులకు అప్పగించిన దత్తత వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.