సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అల్లూరి సీతారామరాజు

సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు హెచ్చరించారు. తెలియని లింక్లను క్లిక్ చేయడం, ఓటీపీ లేదా పిన్ నంబర్లను ఎవరికీ షేర్ చేయడం చేయరాదని సూచించారు. ఉచిత బహుమతులు, నకిలీ లోన్ యాప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటూ అల్లూరి పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే స్పందించి పోలీసులను ఆశ్రయించాలని స్పష్టం చేశారు.