9/11 దాడుల వేళ బెన్ స్లైనీ సాహసోపేత నిర్ణయం.
రిపోర్టర్: రాజేష్
స్థలం: USA
అమెరికాపై 9/11 ఉగ్రదాడుల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే బెన్ స్లైనీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గగనతలంలో ఉన్న సుమారు 4,500 విమానాలను అత్యవసరంగా కిందికి దించాలని ఆయన ఇచ్చిన సాహసోపేతమైన ఆదేశాల వల్ల వేలాది మంది ప్రాణాలు దక్కాయి.