అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఖమ్మం
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారని కలెక్టర్ ఖమ్మం వెల్లడించారు. శుక్రవారం నాడు మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ఖమ్మం బైపాస్ రోడ్ లోని పీవిఆర్ గార్డెన్స్ లో ఏదులాపురం ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు ఈ కీలక ప్రకటన చేస్తూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు.