'ల్యాబ్ రిపోర్టుల కోసం గంటల తరబడి ఎదురుచూపులు': మంథని ఆసుపత్రిలో పేషెంట్ల అవస్థలు

రిపోర్టర్: శివ స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ ఆసుపత్రికి రోజురోజుకూ సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లతో పేషెంట్ల తాకిడి భారీగా పెరుగుతోంది. గురువారం ఓపీ, ల్యాబ్ విభాగాల వద్ద రోగులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టగా, పరీక్షా రిపోర్టులు రావడానికి గంటల సమయం పడుతుండటంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న 30 బెడ్లతో పాటు పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వైద్య సేవలు మెరుగుపరిచి, ల్యాబ్ రిపోర్టులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.