చైనాలో రోబోతో కలిసి బాస్కెట్ బాల్ ఆడిన స్టెఫాన్ కర్రీ!
రిపోర్టర్: విజయ్
స్థలం: China
చైనాలోని బీజింగ్ లో పర్యటిస్తున్న ఎన్ బి ఎ స్టార్ ప్లేయర్ స్టెఫాన్ కర్రీ ఓ వినూత్న అనుభవాన్ని ఎదుర్కొన్నారు. జిమ్ లోకి పాట పాడుకుంటూ ప్రవేశించిన ఓ రోబో, బంతిని తీసుకుని కర్రీతో పాటు అద్భుతంగా షాట్లు వేసింది. చైనా టూర్ లో భాగంగా సింగ్ హువా యూనివర్సిటీ హైస్కూల్ ను సందర్శించిన కర్రీ, విద్యార్థులతో ముచ్చటించి వారికి క్రీడా పాఠాలు నేర్పించారు.