నెల్లిమర్ల ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

ప్రజల కష్టాలను తన కష్టంగా భావిస్తూ కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిరుపేదలకు అత్యవసర వైద్య చికిత్సలకు భరోసా కలుగుతోందని స్థానిక నేతలు స్పష్టం చేశారు.