తెలంగాణలో వీడనున్న వాయుగుండం ప్రభావం సెప్టెంబర్ 26 నుండి ఎండలు
రిపోర్టర్: రాము
స్థలం: Telangana
తెలంగాణలో వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గిపోనుందని ప్రముఖ వెదర్ ఫోర్కాస్టర్ Telangana Weatherman వెల్లడించారు. సెప్టెంబర్ 25 ఉదయం నుండి వర్షాల తీవ్రత తగ్గుముఖం పడుతుందని, సెప్టెంబర్ 26 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మరియు ఉక్కపోత పరిస్థితులు తిరిగి రానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్‌కు సంబంధించి ప్రధాన వర్షాలు దాదాపు ముగిశాయని, సెప్టెంబర్ 30 వరకు వర్షాకాలంలో తాత్కాలిక విరామం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.