'మోదీ నాయకత్వం చారిత్రాత్మకం': చంద్రబాబు, లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వం భారతదేశ చరిత్రలో చారిత్రాత్మకమని, 25 సంవత్సరాల ఆదర్శప్రాయమైన ప్రజాసేవ దేశ వృద్ధికి కొత్త ఊపునిచ్చిందని చంద్రబాబు కొనియాడారు. సాధారణ నేపథ్యం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన మోదీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని నారా లోకేష్ పేర్కొన్నారు.