కలెక్టర్ల సదస్సులో అధికారుల గైర్హాజరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు కీలక శాఖాధిపతులు గైర్హాజరు కావడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి రాకపోవడానికి ధైర్యమెక్కడిదని నిలదీశారు. గైర్హాజరైన అధికారుల నుంచి తక్షణమే సంజాయిషీ కోరాలని సీఎస్ సాయిప్రసాద్‌ను ఆదేశించారు. ఫైళ్ల పెండింగ్, నిర్లక్ష్య వైఖరిపై మండిపడిన ఆయన, మొబైల్ ఫోన్లు పక్కన పెట్టి బాధ్యతగా పనిచేయాలని హెచ్చరించారు.