తుపాను బాధితులకు భారీ ఊరట: సిలిండర్ల డెలివరీకి ఓటీపీ నుంచి మినహాయింపు

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

అతి తీవ్ర తుపాను అర్నబ్ ప్రభావంతో అల్లాడుతున్న ఏపీలోని పలు జిల్లాల్లో బాధితులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ మరియు మొబైల్ నెట్వర్క్ సమస్యల కారణంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ఓటీపీ ధ్రువీకరణ లేకుండానే నేరుగా నగదు చెల్లించి పొందేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 13 జిల్లాల్లో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని పంపిణీ సంస్థలను ఆదేశించారు.