ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
రిపోర్టర్: రాము
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న వసతులను పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రులకు వైద్యం కోసం వచ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వైద్య సేవలు మెరుగ్గా అందుబాటులో ఉండేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆయన గట్టిగా ఆదేశించారు. వైద్యుల పనితీరుపై ఆరా తీశారు.