రాప్తాడు ఘటన: విద్యార్థులకు మానసిక భరోసా కల్పిస్తున్న మంత్రి నారా లోకేష్

రిపోర్టర్: శివ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన నేపథ్యంలో విద్యార్థుల్ లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు ఇరవై మంది మానసిక ఆరోగ్య కౌన్సెలర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఘటన జరిగిన పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు కౌన్సెలర్లు స్వయంగా వెళ్లి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా చదువుపై పూర్తిగా దృష్టి సారించేలా అవసరమైన మానసిక స్థైర్యాన్ని, భరోసాని కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.