సంస్కృతిని రక్షించేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని సువేందు అధికారి పిలుపు

రిపోర్టర్: రాము స్థలం: కోల్‌కతా

కోల్కతాలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూ, మారుతున్న జనాభా తీరు తెన్నులు, ధ్వంసమవుతున్న మన సంస్కృతిని కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. సనాతన ధర్మం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్రంలో జాతీయ భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, అసాంఘిక శక్తులు మరియు చట్టవిరుద్ధ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.