భైరిపురంలో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకున్న చైతన్య దుర్గామాతల ప్రదర్శన
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బలిజిపేట
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం భైరిపురంలో దేవీ నవరాత్రుల సందర్భంగా బొబ్బిలి బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో చైతన్య దుర్గామాతల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్యలను దేవతామూర్తులుగా అలంకరించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించారు. చెడు గుణాలను తొలగించుకొని సద్గుణాలను అలవర్చుకోవాలని బ్రహ్మాకుమారీస్ నిర్వాహకులు పేర్కొన్నారు.