తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర చారిత్రాత్మకం: కేటీఆర్ ప్రశంస

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు సింగరేణి కార్మికులు అండగా నిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 42 రోజులపాటు సాగిన ఉద్యమంలో, కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలోనూ కార్మికులు ఆయన వెంట నడిచారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు బోనస్ల కోసం పోరాడితే.. సింగరేణి కార్మికులు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.