స్థానిక సంస్థల ఎన్నికలు నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైకాపా
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతూ వైకాపా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సర్ ప్రక్రియ ముగియకుండానే ఎన్నికలకు సిద్ధమయ్యారని, వెంటనే విచారణ చేపట్టాలని న్యాయవాది కోరారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్లో తమ వాదనలు వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.