సిరిసిల్లపై పోలీసుల దండయాత్రంటూ రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ధ్వజం

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

సిరిసిల్లలో నాలుగు వేల మంది పోలీసులతో సీఎం రేవంత్ రెడ్డి దండయాత్ర చేయడం శత్రు రాజ్యమా అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. సనత్నగర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ హయాంలో సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి చూసి నేర్చుకోవాలని హితవు చెప్పారు. నిరుద్యోగులపై లాఠీచార్జ్లు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పతనం గ్రాడ్యుయేట్ ఎన్నికలతోనే ప్రారంభమవుతుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.