ప్రధాని మోదీని చూసేందుకు నకిలీ ఐడీతో సైనికుడి యత్నం
రిపోర్టర్: వెంకట్
స్థలం: మహారాష్ట్ర
ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 2023లో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటన వెలుగులోకి వచ్చింది. మోదీ వీరాభిమాని అయిన ఒక సైనికుడు ప్రధానిని నేరుగా చూసేందుకు ట్యాంపరింగ్ చేసిన ఎన్‌ఎస్‌జి గుర్తింపు కార్డు, నకిలీ పాస్‌ను ఉపయోగించి భద్రతా వలయాన్ని దాటేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరిపారు.