ఇండియా కూటమి నిరసన ప్రదర్శన: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీనామా కోరుతూ సుప్రీంకోర్టు వైపు ఇండియా కూటమి చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ప్రదర్శన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురిపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. బారఖంబా, తిలక్ మార్గ్ సహా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, అనుమతి లేకుండా బారికేడ్లు బద్దలు కొట్టి నిరసన తెలిపినట్లు అధికారులు స్పష్టం చేశారు.