ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు: పదకొండు స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం

రిపోర్టర్: గోపి స్థలం: లక్నో

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఐదు గ్రాడ్యుయేట్లు, ఆరు ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలో మొత్తం నూట యాభై మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార బీజేపీ మరియు సమాజ్ వాదీ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొన్నట్లు రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.