ఆసియా క్రీడల్లో పతకం సాధించిన క్రీడాకారులను అభినందించిన కిషన్రెడ్డి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
ఆసియా క్రీడల్లో మిక్స్డ్ టీమ్ స్కీట్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన అనంత్ జీత్ సింగ్ నరుకా, పరినాజ్ ధాలివాల్లను కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అభినందించారు. పతకాల వేటలో వారు మరో పతకాన్ని దేశానికి అందించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. క్రీడా రంగంలో భారతీయ క్రీడాకారులు సాధిస్తున్న విజయాలు దేశం గర్వించేలా ఉన్నాయని ఆయన కొనియాడారు.