ప్రేక్షకులు కోరుకునే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ది ప్యారడైజ్ వస్తోంది
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో యాక్షన్ కంటే ఎమోషన్స్ ఎక్కువగా డామినేట్ చేస్తాయని, గోదావరిఖని, ఆదిలాబాద్ ప్రాంతాల వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రూపొందించినట్లు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విలేకరుల సమావేశంలో తెలిపారు.