ఆత్రేయపురం మండలంలో దారుణం: ఆవుపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన ముగ్గురు నిందితులు

రిపోర్టర్: రాము స్థలం: ఆత్రేయపురం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి లంకలో విచక్షణ కోల్పోయిన ముగ్గురు వ్యక్తులు ఓ ఆవుపై అఘాయిత్యానికి పాల్పడి ప్రాణం తీశారని స్థానికులు తెలిపారు. ఎస్.వెంకటరమణ, ఏ.శ్రీనువెంకన్న, పల్లంరాజు మద్యం మత్తులో ఈ అరాచకానికి ఒడిగట్టారని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు నిందితులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారని, గోమాతను పొట్టనబెట్టుకున్న కామదారులను కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్, హిందూ పరిషత్ సభ్యులు తీవ్రంగా డిమాండ్ చేశారు.