యూఎస్ ఓపెన్ టెన్నిస్ విజేతగా నిలిచిన ఎలెనా రిబాకినా
రిపోర్టర్: గోపి
స్థలం: World
అమెరికా వేదికగా జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఎలెనా రిబాకినా అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబలెంకాను ఓడించి రిబాకినా తొలిసారి యూఎస్ ఓపెన్ ట్రైఫీని ముద్దాడింది. ఈ విజయంతో ఆమె మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని అధికారికంగా దక్కించుకోవడంతో పాటు, తన కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.