మనుబోలులో బల్ల హరేంద్ర కుటుంబాన్ని పరామర్శించిన కిరణ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జ్ బల్ల హరేంద్రను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరిన ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని పార్టీ కార్యక్రమాలలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆయన కుటుంబానికి కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యం చెప్పారు.