మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రమేయం

రిపోర్టర్: విజయ్ స్థలం: పల్నాడు

వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రమేయంపై ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైకాపా నేతలు మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంలకు సబ్‌కాంట్రాక్ట్‌ ఇప్పించడంలో అంబటి పాత్ర ఉన్నట్లు గుర్తించింది. 2020 నుంచి 2024 మధ్య వీరి ఖాతాల్లోకి చేరిన కోట్లలోని నిధులపై దర్యాప్తు వేగవంతం చేసింది.