పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలపై వైకాపా పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
పులివెందుల మున్సిపాలిటీలో రీపోలింగ్ నిర్వహించాలంటూ వైకాపా నేతలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. అభ్యంతరం ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. వైఎస్ ప్రమీల, ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఓట్ల లెక్కింపును నిలువరించాలని కోరిన అభ్యర్థనను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది.