మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, కారు వాగులో పడి ఎనిమిది మంది మృతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లా నల్ఖేడా పట్టణంలో ప్రసిద్ధ బగులాముఖి ఆలయం సమీపంలో వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులోకి కారు పడిపోవడంతో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది ఒడిశా రాష్ట్రానికి చెందిన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు యత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.