కేపీహెచ్‌బీలో మద్యం మత్తులో కారు బీభత్సం, 8 బైక్‌లు ధ్వంసం
రిపోర్టర్: వెంకట్
స్థలం: మేడ్చల్-మల్కాజిగిరి
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన పార్క్ చేసిన ఎనిమిది ద్విచక్ర వాహనాలను ఒకేసారి ఢీకొట్టడంతో అవి నుజ్జునుజ్జయ్యాయి. కారులో మద్యం సీసాలను గుర్తించిన స్థానికులు, డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.