హైదరాబాద్లో వైభవంగా బాలాపూర్ గణేష్ లడ్డూ శోభాయాత్ర ప్రారంభం

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర లడ్డూ వేలం పాట ముగిసిన వెంటనే అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వినాయకుడిని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం మరియు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్సేన్ సాగర్ తీరంతో పాటు నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాలలో అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.