భారీ వర్షాల ముప్పు: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు స్పష్టం చేశాయి. తీర ప్రాంతాల్లో గంటకు నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.