అనంతపురం అభివృద్ధికి రూ.997.99 కోట్ల SASCI నిధులు కేటాయింపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా ప్రగతి కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగునీరు, విద్య, రహదారుల అభివృద్ధికి రూ.997.99 కోట్ల SASCI నిధులను కేటాయించింది. రైతు సంక్షేమం నుంచి మౌలిక వసతుల కల్పన వరకు అన్ని రంగాలకు కేంద్రం అండగా నిలుస్తోందని, ఈ నిధులతో జిల్లా అభివృద్ధికి మరింత వేగం వస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.