ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల మార్పు పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
శాసనసభల్ లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వుడ్ నియోజకవర్గాలను మార్చాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ స్థానాల రిజర్వ్ మెంట్ అనేది శాసనసభ నిర్ణయించాల్సిన అంశమని, రాజ్యాంగ నిబంధనలను తాము మార్చలేమని ప్రధాన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. రొటేషన్ పద్ధతిని అమలు చేయడంపై చట్టం చేసే అధికారం కేవలం పార్లమెంటుకే ఉందని తేల్చిచెప్పారు.