కుండపోత వర్షాలతో అతలాకుతలమైన ఉమ్మడి విజయనగరం జిల్లా జనజీవనం
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నాగావళి, వేగవతి నదులతో పాటు పలు గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు కాలనీలు జలమయమై ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలి వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.