పోలవరం బ్యాక్‌వాటర్‌తో తెలంగాణకు భారీ ముప్పు: మంత్రి పొంగులేటి హెచ్చరిక
రిపోర్టర్: శివ
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంతో భద్రాచలం సహా తెలంగాణలోని పలు గిరిజన గ్రామాలు నీట మునిగే ప్రమాదముందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విభజన సమయంలో కేసీఆర్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, ఉమ్మడి సర్వే నిర్వహించి ముంపు గ్రామాల ప్రజలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.