ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు, నోటా అమలుకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై బ్యాలెట్లకు బదులు ఈవీఎంలు, నోటా విధానాన్ని ప్రవేశపెట్టింది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో విప్ ధిక్కరిస్తే కౌన్సిలర్ల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. పారదర్శకత కోసం 'Act No.22 of 2026' ద్వారా ఈ కీలక మార్పులను చేపట్టింది. సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిని అనుసరించనున్నారు.