గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్యం: మరో రెండు వేల హెల్త్ క్లినిక్లు

రిపోర్టర్: కిరణ్ స్థలం: కృష్ణా

గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో మరో రెండు వేల ఏడు వందల గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.