అభిషేక్ బచ్చన్‌కు ప్రత్యేక జెర్సీ బహుమతిగా ఇచ్చిన రాహుల్ ద్రావిడ్
రిపోర్టర్: రాజేష్
స్థలం: డబ్లిన్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు తన సిగ్నేచర్ నంబర్ 19 జెర్సీని, ఒక వ్యక్తిగత లేఖను బహుమతిగా అందజేశారు. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ వేదికగా జరుగుతున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ లీగ్‌కు అభిషేక్ బచ్చన్ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు. క్రీడల పట్ల అభిషేక్ చూపుతున్న ఆసక్తిని, మద్దతును ప్రశంసిస్తూ ద్రావిడ్ ఈ కానుకను అందించారు.