అల్లూరి జిల్లాలో రోడ్డు భద్రతపై గ్రామాల్లో విస్తృత అవగాహన
రిపోర్టర్: సతీష్
స్థలం: అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు భద్రతపై బుద్ధమమిడి గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆల్లూరి పోలీస్ వెల్లడించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు అందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.