కలెక్టర్ల సదస్సు నిర్ణయాలు అమలు చేయాలి: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు పక్కాగా అమలయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు సీఎంవో అధికారులను ఆదేశించారు. దస్త్రాల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించి జాప్యం చేసే అధికారుల జాబితా తయారు చేసి వివరణ కోరాలని, సంతృప్తికరంగా లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి నిర్ణయాల అమలును జిల్లా పర్యటనల్లో పరిశీలిస్తానని హెచ్చరించారు.