హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడిపై దాడిని ఖండించిన మల్లు భట్టి విక్రమార్క

రిపోర్టర్: రాము స్థలం: ఖమ్మం

న్యూఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించిన సిగ్గుచేటు ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలు అలాగే ఇతర బలహీన వర్గాలపై నిరంతరం జరుగుతున్న దాడులను ఆపాలని ఆయన డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.