గొల్లప్రోలు తాటిపర్తి రోడ్డుపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: గొల్లప్రోలు

అల్పపీడన ప్రభావంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సుద్దగడ్డ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రాత్రికి నీటిమట్టం మరింత పెరగడంతో గొల్లప్రోలు-తాటిపర్తి రోడ్డుపై రెండడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. తీవ్ర ప్రవాహంతో పొలాల్లో ఉన్న రైతులు ఇళ్లకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే విధంగా వర్షాలు కురిస్తే వరద మరింత ముంచెత్తుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.