టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ తో మెరిశాడు
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నట్లు వార్తా వర్గాలు తెలిపాయి. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ లో నాథన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్ ను సెకండ్ స్లిప్ లో ఒంటి చేత్ తో అందుకుని కోహ్లీ సంచలనం సృష్టించాడు. కుడివైపు డైవ్ చేస్తూ బంతిని అద్భుతంగా పట్టుకున్న కోహ్లీ, ఆర్చరీ సెలబ్రేషన్ తో మైదానంలో అందరినీ అలరించినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి.