ఢిల్లీలో ప్రజాస్వామ్యవాదుల నిర్బంధాలను ఖండించిన వామపక్ష నేతలు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

దిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజాస్వామ్యవాదులను, నేతలను పోలీసులు అడ్డుకోవడంపై పలాస కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితా సవరణపై వస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తే ప్రజాగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.